Actress Pavitra : ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్స్ నరేష్, తనని ఉద్దేశిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నాయి. అలానే మా ఇద్దరి గురించి ట్రోల్స్ నడిపిస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్స్ ఫొటోలని మార్ఫింగ్ చేసి.. వైరల్ చేస్తున్నాయి. ఈ చర్యలన్నీ మా ప్రైవసీకి భంగం వాటిల్లేలా ఉన్నాయి’’ అని సైబర్ క్రైమ్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి 15 యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వెబ్‌సైట్స్‌కి కూడా నోటీసులు జారీ చేశారని సమాచారం అందుతుంది. మూడు రోజుల లోపు విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్స్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లతో పాటు అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని పవిత్ర లోకేష్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఈరోజు విచారణని ప్రారంభించినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని వెల్లడించారు. కాగా ఇటీవలే సీనియర్ నటుడు నరేశ్ పవిత్రతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన భార్య కూడా వారిపై పలు కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. అంత్యక్రియలు సమయంలోనూ ఇద్దరూ కలిసే కనిపించారు. దాంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.