Political నిన్న సెప్టెంబర్ 13న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో భాజపా తలపెట్టిన నిరసన కార్యక్రమం రణరంగంగా మారడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా స్పందించారు. తాము శాంతియుత ప్రదర్శనలకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటామన్న సీఎం…భాజుపా శ్రేణులు నిరసన పేరుతో ఉద్రిక్తతు సృష్టించారని ఆరోపించారు. నిన్న వారు బాంబులతో పాటు బయట నుంచి సాయుధ గూండాలను తీసుకు వచ్చి హింసకు పాల్పడ్డారంటూ.. మండిపడ్డారు. అనేక మంది పోలీసులపై నిరసనకారులు అమానుషంగా దాడికి పాల్పడ్డారని…. హింసకు పాల్పడిన వారిపై పోలీసులు బహిరంగంగా కాల్పులు జరిపి ఉండొచ్చని మమత వ్యాఖ్యానించారు. కానీ… తమ ప్రభుత్వ అధికార యంత్రాంగం సంయమనంతో వ్యవహరించిందని అన్నారు. ఈ గొడవలో ఇంతవరకు ఎంతమంది గాయాల పాలయ్యారు తెలియలేదని అన్నారు.. బిజేపి ఈ విధంగా రణరంగం సృష్టించడం ఎంత మాత్రం సరికాదని మమతా వాపోయారు. అరెస్ట్‌లు సాగుతున్నాయి… చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు.
అతిపెద్ద పండుగైన దుర్గా పూజకు కొన్ని రోజుల ముందు చోటుచేసుకున్న హింసతో రాష్ట్రంలో పరిస్థితితులు మారాయని మమత అన్నారు. అలానే… నగరంలో ఈ నిరసన ప్రదర్శనలతో ప్రయాణికులు, వ్యాపారులు అసౌకర్యానికి గురయ్యారని తెలిపారు. విధ్వంసకాండకు పాల్పడి… ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టి… ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన భాజపా శ్రేణుల్ని ఉపేక్షించమన్న బెంగాల్ సీఎం… ఈ నిరసనల్లో పాల్గొన్న వారి అరెస్టులు సాగుతున్నాయని… చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానించారు.