ఫిలడెల్ఫియా / హైదరాబాద్, జూలై 2, 2024 : ఉద్యోగులకు హైర్ నుండి రిటైర్ వరకు అసాధారణమైన ప్రీ-బోర్డింగ్ మరియు ఆన్‌బోర్డింగ్ అనుభవాలను అందించడంపై దృష్టి సారించిన మానవ వనరుల సాంకేతిక సంస్థ టైడీని కొనుగోలు చేస్తున్నట్లు ఫెనోమ్ ఈరోజు ప్రకటించింది. ఈ ఐదో స్వాధీనం మరియు ఇంటెలి జెంట్ టాలెంట్ ఎక్స్ పీరియన్స్ ప్లాట్‌ఫామ్ పోర్ట్ ఫోలియోకు ఈ అదనపు జోడింపు ఉద్యోగులకు ఉత్పాద కత కోసం సన్నద్ధమయ్యే సమయాన్ని తగ్గించడానికి ఫెనోమ్ కు గల విజన్ ను బలపరుస్తుంది. అదే స మయంలో హెచ్ ఆర్ ప్రాక్టీషనర్స్ కు సమర్థవంతమైన అనుభవాలను అందిస్తుంది. ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్ నుండి సృష్టిస్తుంది.
ఈ స్వాధీనం గురించి ఫెనోమ్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు మహే బైరెడ్డి మాట్లాడుతూ… “టైడీ చేరికతో, మేం ఆయా సంస్థల ఉద్యోగులు మొదటి నుండి ఉత్పాదకతను కలిగి ఉండేలా సంస్థలకు సాధికారికత అం దించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆన్‌బోర్డింగ్ అనేది టాలెంట్ జర్నీలో కీలకమైన సందర్భం. ఇక్కడ అభ్యర్థులు ఉద్యోగులుగా మారుతారు మరియు ప్రతిభ గల నాయకులు వారిని విజయం సాధించేందుకు నియమిం చుకోవచ్చు. టైడీతో మేం అద్భుతమైన ఎండ్-టు-ఎండ్ టాలెంట్ అనుభవాన్ని సృష్టించడానికి అభ్యర్థులు, ఉద్యోగుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాం. ఉద్యోగి మొదటి రోజు ముందు వరకు అవసర మైన కార్యాచరణ దశలు, ధృవీకరణలు, డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతిభా వంతులను పొందడానికి తోడ్పడుతుంది. ప్రతిభ నిర్వహణ బృందాల కీలకమైన అవసరాలను ఇది పరిష్క రిస్తుంది. ఇది ఉద్యోగులపై శాశ్వతమైన, సానుకూల ప్రభావాన్ని చూపేలా కొత్త నియామకాలకు సంబంధిం చి వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన అనుభవాన్ని సృష్టిస్తూ ఉత్పాదకతకు సమయాన్ని తగ్గిస్తుంది’’ అని అన్నారు.
ఏప్రిల్‌లో జరిగిన IAMPHENOM 2024లో ప్రకటించిన భారీ HR టెక్ ఆవిష్కరణల నేపథ్యంలో టైడీని ఫెనోమ్ కొనుగోలు చేసింది. తన వార్షిక సమావేశంలో, కంపెనీ టాలెంట్ ఎక్స్ పీరియన్స్ ఇంజిన్, X+ ఏజెం ట్స్ ను ఆవిష్కరించింది., టాలెంట్ లీడర్‌లు, టాలెంట్ మార్కెటీర్ల కోసం ఇది ప్రత్యేక ప్లాట్‌ఫామ్ అనుభవా లను అందిస్తుంది. అంతేగాకుండా, ప్రతిభావంతులను పొందడం, ప్రతిభ నిర్వహణకు సంబంధించి ఎన్నో ఆవిష్కరణలను ఆవిష్కరించింది. సహ వ్యవస్థాపకులు కిరణ్ మీనన్, నిఖిల్ గుర్జెర్, గౌరవ్ మాథురే తో సహా టైడీ బృందం ఫెనోమ్‌కి మారు తుంది. హెచ్ఆర్ కోసం వ్యక్తులు ఎలా పని చేస్తారో పూర్తిగా పునర్నిర్వచించేలా టైడీని వీరు ప్రారంభించారు.
“టైడీ ప్రారంభమైనప్పటి నుండి, ప్రతి ఒక్కరికీ పని సజావుగా సాగాలని మేం కోరుకున్నాం” అని టైడీ సహ వ్యవస్థాపకుడు కిరణ్ మీనన్ అన్నారు. “వ్యక్తిగత-ఆధారిత విభజన, ఇంటిగ్రేషన్‌లు, ఆటోమేషన్, ఇంటెలి జెన్స్ ను ఒకే పరిష్కారంగా కలపడం ద్వారా ఆన్‌బోర్డింగ్ అనుభవాలు, సంక్లిష్ట హెచ్ఆర్ కార్యకలాపాల ను మెరుగు పరచడానికి అవకాశం ఉందని మేం గ్రహించాం. పరిశ్రమలో అత్యుత్తమ నియామకం, వృద్ధి, మ రియు రిటెన్షన్ ఫలితాలను అందించడానికి టైడీ సాంకేతికత, వర్క్ ఫ్లోలు ఫెనామ్ సమగ్ర విధానంలో కీల కాంశంగా మారుతాయని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
టైడీ 2019లో స్థాపించబడింది. 30 కంటే ఎక్కువ దేశాలలో కంపెనీలచే స్వీకరించబడింది. టైడీ ప్రతీ విని యోగదారు కోసం తిరుగులేని, సమర్థవంతమైన, వ్యక్తిగతీకరించిన వర్క్ ఫ్లోలను రూపొందించడానికి సాధ నాలు, ప్రక్రియలు, వ్యక్తులను మిళితం చేస్తుంది. హెచ్ఆర్, ఐటీ, ఆపరేషన్స్ టీమ్‌ల నుండి మాన్యువల్ ప్ర యత్నాన్ని తగ్గించడానికి, ఆటోమేషన్ ద్వారా సులభంగా సమ్మతిని సాధించడానికి, ఆన్‌బోర్డ్ కోసం ఉద్యో గులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రపంచంలోని అనేక అతిపెద్ద బ్రాండ్‌లు టైడీకి చెందిన ఎంప్లాయీ డేటా ప్లాట్ ఫామ్ (EDP)ని ఉపయోగిస్తాయి.
టైడీ ఈడీపీ నుండి పూర్తి స్థాయి సామర్థ్యాలు నేరుగా ఫెనోమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉంచబ డుతాయి. హెచ్ఆర్ ప్రాక్టీషనర్స్ ప్రతిభావంతులను పొందడం, ఆన్‌బోర్డింగ్, ప్రతిభ నిర్వహణ అవసరాల కోసం ఒక కామన్ యూజర్ ఇంటర్‌ఫేస్ ను అందిస్తుంది. ఫెనోమ్ ప్లాట్‌ఫామ్‌కు జోడించబడిన కొత్త కార్యా చరణ, మెరుగుదలలు కింది వాటితో సహా కీలక వినియోగ సందర్భాలకు మద్దతు ఇస్తాయి.
వీటితో సహా :
● కొత్త నియామకాల కోసం ప్రీబోర్డింగ్ మరియు ఆన్‌బోర్డింగ్
● వర్తించే తనిఖీలు మరియు ఆమోదం సమన్వయం
● నేపథ్య తనిఖీల ఇంటిగ్రేషన్
● డాక్యుమెంటేషన్ కలెక్షన్ , ధ్రువీకరణ మరియు సమర్పణ
● ప్రొవిజనింగ్ మరియు ఐటీ అసెట్ కలెక్షన్ ట్రిగ్గర్స్
● పేరోల్ ప్రారంభం
● ఆఫ్‌బోర్డింగ్
“టైడీని కొనుగోలు చేయడం మరియు దాని ఇంటెలిజెంట్ టాలెంట్ ఎక్స్ పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీబోర్డింగ్, ఆన్‌బోర్డింగ్ జోడించడం అనేది ఫెనోమ్‌కు సహజమైన పురోగతి. ఒక సమగ్ర పరిష్కారం పొందేందుకు వీలుగా ప్రతిభను పొందడాన్ని వృద్ధి చేసుకోవడం మరియు అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన భాగాన్ని ఏకీకృతం చేయడం” అని ఫాస్‌వే గ్రూప్ సీఈఓ డేవిడ్ విల్సన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ‘‘హె చ్ఆర్ టెక్ పరిశ్రమలో కన్సాలిడేషన్ వేగంగా కొనసాగుతోంది. ఈ స్వాధీనం ఫెనోమ్ నిరంతర విజయం, వృద్ధికి అలాగే వినియోగదారులకు తిరుగులేని ఎండ్-టు-ఎండ్ అనుభవాన్ని అందించడంపై ఆ సంస్థకు గల దృష్టికి నిదర్శనం’’ అని అన్నారు.
ఫెనోమ్‌తో, అభ్యర్థులు సరైన ఉద్యోగాన్ని వేగంగా కనుగొని, ఎంపిక చేసుకుంటారు. ఉద్యోగులు తమ నైపు ణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు, అభివృద్ధి చెందుతారు. రిక్రూటర్లు విపరీతమైన ఉత్పాదకతను కలిగిఉం టారు. టాలెంట్ మార్కెటీర్స్ తీవ్ర సామర్థ్యంతో నిమగ్నమై ఉంటారు. టాలెంట్ లీడర్లు నియామక ప్రక్రియల ను ఆప్టిమైజ్ చేస్తారు. మేనేజర్‌లు పటిష్టంగా పనిచేసే బృందాలను నిర్మిస్తారు. కంపెనీ లక్ష్యాలతో ఉద్యోగుల అభివృద్ధిని హెచ్‌ఆర్ అనుగుణ్యం చేస్తుంది. ఒక సంపూర్ణ మౌలిక వసతులను రూపొందించడానికి ఇప్ప టికే ఉన్న హెచ్ఆర్ సాంకేతికతను హెచ్ఆర్ఐటీ సులభంగా అనుసంధానిస్తుంది.
టైడీని ఫెనోమ్ కొనుగోలు చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి, మా blog ను సందర్శించండి. సంపూర్ణ ఆన్‌బోర్డింగ్ అనుభవాలను మరింతగా తెలుసుకునేందుకు webinar కోసం నమోదు చేసుకోండి.