Indian 2 Movie : పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఇండియన్ 2 చిత్రం తిరిగి పట్టాలెక్కనుంది. అనివార్య కారణాలతో ఈ సినిమా చిత్రీకరణ అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో కమల్ హసన్ హీరోగా నటిస్తుండగా… కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఇండియన్-2 మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా… అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ మూవీలో యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పంజాబ్లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న యోగ్ రాజ్ సింగ్ ఇలా పెద్ద హీరో పాన్ ఇండియా మూవీలో కనిపించడం ఇదే తొలిసారి. గతంలో కమల్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ మూవీ విడుదలై అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. తెలుగులో ‘భారతీయుడు’గా ఈ సినిమాని అప్పట్లో విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న కమల్ హాసన్కి ఇటీవల విడుదలైన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్ ఇచ్చింది. దీంతో ఇండియన్-2 మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
నవంబర్ 1న చెన్నైలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. తన సన్నివేశం కోసం మేకప్ వేసుకుంటున్న యోగిరాజ్ సింగ్ ఫోటోను షేర్ చేస్తూ… ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్ కు థాంక్స్. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది. అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, రుకల్, బాబీ సింహా కీలకపాత్రలలో నటిస్తున్నారు.