కరోనా మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు కరోనా బారి నుంచి కోలుకున్నా, దాని వల్ల కలిగిన దుష్పరిణామాల కారణంగా చనిపోయారు. ఆరోగ్య, పారిశుద్ధ కార్మికులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ త్యాగాల ఫలితంగా భారత్‌లోనూ 95 శాతం మంది కోవిడ్-19 మహమ్మారిని జయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
యితే కరోనా మహమ్మారిని జయించిన వారిపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. కరోనా బారి నుంచి కోలుకున్న వారు ఒక్క డోసు కొవిడ్ టీకా(Covid19-Vaccine) తీసుకుంటే సరిపోవచ్చని అమెరికా సహా పలు దేశాల శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.