Bhakthi సాయిబాబా షిరిడి సాయి గాని మనందరికీ తెలిసిన సాయి బాబా జన్మస్థలం షిరిడి కాదా మరైతే సాయిబాబా ఎక్కడ జన్మించారు దీనిపై అనేక వాదనలు ఉన్నాయి..
మహారాష్ట్రలో మన్వత్ రోడ్డు అనే స్టేషన్ ఉంది. దీని దగ్గర్లో ఉన్న పత్రి అనే గ్రామమే సాయిబాబా జన్మ స్థలమని పత్రి వాసుల నమ్ముతారు.. కాదు షిరిడి అని షిరిడి ప్రజలు అంటారు.. అయితే ఈ మన్వత్ రోడ్ స్టేషన్ దగ్గర “సాయిబాబా జన్మస్థలాన్ని దర్శించడానికి ఇక్కడ దిగండి” అనే ఒక బోర్డు ఎన్నో ఏళ్లుగా కనిపిస్తుంది. బాబా 1838లో పత్రిలో జన్మించారని.. ఈ విషయంపైన ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయని.. సాయిబాబా జన్మస్థలం ట్రస్ట్ చైర్మన్ చౌధరీ అప్పట్లో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు..
“సాయిబాబా పత్రిలో జన్మించారని.. తన తల్లిదండ్రులు తనను ఓ ఫకీరుకు దత్తతకు ఇచ్చారని తన శిష్యుడితో సాయిబాబా చెప్పారు.. సాయిబాబా అసలు పేరు హరిభావు భుసారి. ఆయన పెద్ద సోదరుడు కూడా ఒక ఫకీరే.. తన సోదరుడి వల్ల సాయిబాబా ప్రభావితమై ఉండవచ్చు” అని వివరించారు.. “ఇక్కడ పత్రి గ్రామంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఈ ఊరి చరిత్రలో చాలామంది ఫకీర్ల గురించి ప్రస్తావన ఉంది… అలాంటి ఫకీర్లు వలన సాయిబాబా ప్రభావితం అయి ఉంటారు. అందుకే, ఆయన వస్త్రధారణ కూడా ముస్లిం ఫకీర్లలానే ఉంటుంది” అని చౌధరీ వివరించారు.
అయితే అప్పట్లో మహారాష్ట్ర గవర్నమెంట్ పత్రి డెవలప్మెంట్ కు 100 కోట్ల ఫండ్ రిలీజ్ చేసింది. ఈ విషయంపై షిరిడి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కోట్లతో పత్రిని డెవలప్ చేస్తే పత్రి మరొక షిరిడి అవుతుందని.. అప్పుడు షిరిడి ప్రాధాన్యత తగ్గిపోతుందని ఎన్నో బంద్ లు కూడా చేశారు.