Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను మొదలుపెట్టారు.. ఈ కార్య క్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికైంది. ఈ సందర్భంగా జగన్ తన చేతుల మీదగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్లను పంపిణీ చేశారు… రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేసారు..
ఈ పంపిణీ అనంతరం మాట్లాడిన జగన్.. ఈరోజు ఆ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఆర్థిక కారణాలతో ఎందరో పిల్లలు చదువుకోలేకపోతున్నారు ఆ తల్లిదండ్రుల బాధలు చూసి ఈ రకంగా విద్యార్థులకు పలు అవకాశాలు కల్పిస్తున్నాము అయితే భవిష్యత్తు మారాలి అంటే చదువు ఒకటే మార్గం అంటూ చెప్పుకొచ్చారు..అలాగే విద్యార్థులకు అన్ని విషయాల్లో సమానత్వం ఉండాలని విద్యా విధానంతోనే తలరాతలు మారుతాయి అనీ చెప్పుకొచ్చారు.. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు ఎంతగానో సహాయం చేయాలని చెప్పారు జగన్ సమాజంలో ఉన్న అంతరాలు తొలగి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం డిజిటల్ విద్య అందించాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.. అలాగే ముందు ముందు విద్యార్థుల కోసం మరిన్ని అవకాశాలు తీసుకువస్తామని వారంతా చదువు మీద శ్రద్ధ పెట్టి ఉన్నత స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు