ఆనం రామనారాయణ రెడ్డి పోతే ఆనం జయకుమార్ రెడ్డి వచ్చే..
ఆనం జయకుమార్ రెడ్డిని వైఎస్ఆర్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్.
రాజకీయ చరిత్ర ఉన్న తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని.. చంద్రబాబు సైతం మోసం చేస్తూ వస్తున్నారని తనను నమ్ముకున్న కార్యకర్తలకు సైతం ఏం చేయలేకపోతున్నానని ఆనం జయకుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
ఆనం జయకుమార్ రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరికతో.. నెల్లూరు టీడీపీ కుదేలైనట్లే ఆనం రామనారాయణ రెడ్డి రాకతో టీడీపీ బలోపేతం కాకపోగా, బలహీనపడుతూ వచ్చింది. కోటంరెడ్డి రాజకీయ అవకాశవాది అని ముద్రపడటంతో టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేష్ కూడా దూరం పెడుతూ వస్తున్నారు. మొత్తానికి నెల్లూరు రాజకీయాలు రసకందాయంలో ఉన్నాయి.
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో లోకేష్ యువగళం అట్టర్ ప్లాప్ అయింది. ఆనం జయకుమార్ రెడ్డి వైసీపీలో చేరికతో నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కోటంరెడ్డిలకు చెక్ పెట్టినట్లైంది.
సీఎం జగన్ ఎత్తుగడలు ఎలా ఉంటాయో ప్రత్యర్ధులకు కూడా అందని విధంగా ఉంటాయని జయకుమార్ రెడ్డి చేరికతో చంద్రబాబుకు అర్థమై ఉంటుంది.