Entertainment మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటివరకు సంక్రాంతి బరిలో పోటీ పడుతూ వచ్చాయి అయితే ఎన్నాళ్ళలో వీరిద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదల అయినవి ఏంటి అంటే..
ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి ఈ సందర్భంగా ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు చిరు బాలయ్య చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి అయితే అవి ఏంటి అనే విషయం ఒకసారి చూద్దాం..
2023లో చిరు బాలయ్య సినిమాలు12న వీరసింహారెడ్డి.. 13కి వాల్తేరు వీరయ్య సినిమాలో అభిమానులు ముందుకి రాబోతున్నాయి అలాగే 1985లో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం బాలయ్య నటించిన ఆత్మబలం సినిమాలు ఆ ఏడాది ఒకేరోజు విడుదలై సందడి చేశాయి.. 1987 జనవరి 9న చిరంజీవి దొంగ మొగుడు సినిమా బాలకృష్ణ భార్గవ రాముడు సినిమా జనవరి 14న ప్రేక్షకులు ముందుకి వచ్చాయి అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.. 1988లో జనవరి 15న బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా.. జనవరి 14న చిరంజీవి నటించిన మంచి దొంగ సినిమా విడుదలైంది..
అలాగే 1997లో జనవరి 4న చిరంజీవి హిట్లర్ సినిమా విడుదల కాగా జనవరి 10న బాలయ్య పెద్దన్నయ్య చిత్రం విడుదలైంది.. ఈ రెండు సినిమాలు అప్పట్లో మంచి టాక్ తెచ్చుకున్నాయి.. 1999లో జనవరి 1న చిరంజీవి స్నేహం కోసం సినిమా విడుదల కాగా బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమా జనవరి 13న విడుదలైంది.. 2000లో చిరంజీవి నటించిన అన్నయ్య సినిమా విడుదల కాగా బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు విడుదలైంది… 2001లో చిరంజీవి నటించిన మృగరాజు సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాగా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సంక్రాంతికి విడుదలైంది.. అలాగే 2004లో చిరంజీవి కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన అంజి సినిమా విడుదల కాగా బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ కూడా సంక్రాంతికి విడుదలైంది.. చిరంజీవి 2017లో ఖైదీ 150 సినిమాతో సంక్రాంతి బరిలో నిలవగా బాలకృష్ణ తన వందల చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో అభిమానులు ముందుకి వచ్చారు..