Health చాలామంది పిల్లలకు బ్రష్ చేయించాల్సిన అవసరం లేదని అపోహలో ఉంటారు కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుపుతున్నారు..
చాలావరకు తల్లిదండ్రి పిల్లలకు ఒక వయసు వచ్చేంత వరకు బ్రష్ చేయించాల్సిన అవసరం లేదని అనుకుంటారు కానీ ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని అంటున్నారు డాక్టర్లు ఇలా చేయడం వల్ల వారి నోట్లో హానికరమైన బ్యాక్టీరియా పేరుకుపోతుందని తెలుపుతున్నారు దీని ద్వారా నోటికు సంబంధించిన వ్యాధులే కాకుండా పొట్టకు సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులు వస్తాయని తెలుస్తోంది అందుకే చిన్నపిల్లలకు కచ్చితంగా బ్రష్ చేయించాలి..
సంవత్సరం వయసు దాటిన పిల్లలకి నెమ్మదిగా నోటినీ నీటితోనే శుభ్రం చేయాలి ఈ వయసు పిల్లలకు బ్రష్ అవసరం లేదు కానీ రెండేళ్లు దాటిన తర్వాత నుంచి మెత్తని బ్రాషన్ ఉపయోగించాలి. అలాగే డాక్టర్ సూచన మేరకు టూత్ పేస్ట్ ను వాడాలి అలాగే పల్లు మొత్తాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఇలా చేయడం వల్ల తద్వారా వారి జీవితంలో నోటి ఆరోగ్యానికి సంబంధించిన ఒక అవగాహన కలిగి ఉంటారు. జీవితాంతం నోటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారని తెలుస్తోంది అలాగే చిన్నపిల్లలకు ప్రతి విషయాన్ని తెలియజేయాలి. ఎలాంటి అపోహలకు వారిని గురికానివ్వకుండా ఉండాలి..