Chaurya Paatam : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ సూపర్ హిట్అయ్యాయి. సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కారణాలు ఏమైనా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ థియేటర్స్ రావడం తగ్గింది. ఇలాంటి సమయంలో అంతా కొత్తవారితో సినిమా చేయడం అనేది ఒక సాహసమే. అలాంటి సాహసం ఈ సినిమాతో చేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత అసలు కష్టాలు అర్థం అయ్యాయి. నిర్మాత మీద విపరీతమైన గౌరవం పెరిగింది. మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మేము వయసుకు వచ్చాం అలానే లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తో ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నాం. దయచేసి ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా చూడండి. కార్తీక్ చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. తను చెప్పిన కాన్సెప్ట్ అసలు క్రైమ్ లేని ఊరు. ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దాన్ని బేస్ చేసుకుని ఒక కథ చేశాం.
చోర్య పాఠం అంటే దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదు. ఒక అవసరం కోసం ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. అది చేస్తున్న ప్రాసెస్ లో ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక టన్నల్ తవ్వి దాని గుండా వెళ్లే క్రమంలో జరిగే కథ. ఇది టెక్నికల్ గా నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. దీనికి అద్భుతమైన లవ్ స్టొరీ రాసాడు నిఖిల్. దేవ్ జాండ్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. పెద్ద సినిమా విజువల్స్ లా ఉంటాయి. జీరో లెవల్ ఆక్సిజన్ షూట్ చేశాం. ఇది ఒక డార్క్ కామెడీ ఫిలిం. టెక్నికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 14 సెట్స్ వేశాం. చాలా కష్టపడి సినిమా తీశాం. అందరూ చాలా సపోర్ట్ చేశారు. రోల్ రీడ చాలా మంచి ప్రమోషనల్ సాంగ్ ఇచ్చాడు. నేను స్వయంగా రీ రికార్డింగ్ దగ్గర ఉన్నాను. చాలా అద్భుతంగా వచ్చింది. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా చూశారు. అందరూ ముక్తకంఠంతో మ్యూజిక్ డైరెక్టర్ ని మెచ్చుకున్నారు.
ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. ఈ సినిమా కోసం థియేటర్స్ కి రండి. చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి. మీరు సినిమా చూస్తేనే మేము సినిమా తీగలం. 25న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. మీరంతా ఫ్యామిలీస్ తో రండి. హ్యాపీగా చూడండి. టీం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ మీరు ఇస్తారని భావిస్తున్నాను. ఇంద్ర చాలా కష్టపడ్డాడు. డే అండ్ నైట్ పని చేశాడు. హీరోయిన్ చాలా అద్భుతంగా పెర్ఫాం చేసింది. సినిమాలో చాలా ఎక్సలెంట్ గా ఉంది. నిఖిల్ చాలా అద్భుతంగా ఈ సినిమా రాశాడు. ఈ సినిమాని చూసి మా అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’అన్నారు.