Political News : వైసిపి పార్టీ అధికారంలో వచ్చినప్పటినుండి టిడిపి పార్టీ కార్యకర్తలపై నాయకులపై దాడులు బెదిరింపులు అధికమవుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే నెల్లూరు జిల్లా కావలిలో కరుణాకర్ ఆత్మహత్యపై ఆయన మండిపడ్డారు. కరుణాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు వైసిపి నేతలేనని దుయ్యబట్టారు.
కరుణాకర్ మృతికి కారణమైన వారికి శిక్షపడేవరకు మేమందరం పోరాడతామని చంద్రబాబు తెలిపారు.
బాధిత కుటుంబంతో ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి ప్రస్తుత ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా వారిపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. అయితే కరుణాకర్ మరణానికి కారకులైన వారి పేరుని లెటర్ లో రాసిన ఇంకా నిందితులపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని పోలీసులపై ఫైర్ అయ్యారు బాబు. వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముసునూరు కాలనీకి చెందిన కరుణాకర్ స్వతగా చాపల చెరువులు పెంచుకుంటూ ఉంటారు. గత రెండు సంవత్సరాల నుంచి కరుణాకర్ చాపల చెరువు పై నష్టాలు తప్ప లాభాలు లేవని చెప్పుకోవాలి. అయితే ఈ ఏడాదైనా వర్షాలకు ముందే చేపలు పట్టి లాభాలను ఆశించాలన్నారు కరుణాకర్. అయితే ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడం బెదిరించడం లేదా చెరువులో మందు కలపడం వంటివి చర్యలకు పాల్పడుతున్నారు. అధికార ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు కరుణాకర్. తన మరణానికి కార్మికులైన పేర్లను లెటర్లో రాసి నెల్లూరు జిల్లా ఎస్పీకి పంపించడం జరిగింది.