Politics తాజాగా బుధవారం జరిగిన సమావేశాల్లో విశాఖపట్నం రైల్వేస్ వన్ పై కేంద్ర రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది.. అలాగే ఈ రైల్వే జోన్ ఏర్పాటు నిర్వహణ కార్యక్రమాలకు పరిమితి లేదంటూ కూడా తెలిపింది..
దేశంలో ఇప్పటివరకు ఉన్న రైల్వే జోన్లకు అదనంగా విశాఖ రైల్వే జోన్ గత కొన్నాళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే అప్పటి నుంచి విశాఖ రైల్వే జోన్ అంశం కొనసాగుతూనే ఉంది… కానీ ఈ విషయం మాత్రం ముందుకు వెళ్లలేదు.. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన కేంద్ర రైల్వే బోర్డు ఈ విషయంలో నిర్వహణ కార్యక్రమాలకు పరిమితి లేదంటూ చెప్పుకొచ్చింది..
విశాఖపట్నం రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్లు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించింది.
అలాగే 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. అయితే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న రైల్వే జోన్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.. దేశవ్యాప్తంగా 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్న ఏపీలో మాత్రం లేని సంగతి తెలిసిందే.. మరి ఈ విషయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.. అదేవిధంగా కాజీపేటకు కొత్త డివిజన్ను గా ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది..