Politics తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎప్పటి అయిన దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ నాయకుడు ఎవరు అవుతారు అంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి ఈరోజు రాష్ట్రాలు అయితే తాజాగా ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది..
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పై తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలువురు నాయకులు పై ఫోకస్ పెట్టిన ఈ పార్టీ ముఖ్యమైన నాయకులు అందర్నీ తన పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది దీంతో ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది అలాగే ఇతను అయితే ఇతను ఇంతకుముందు వైసీపీలో పని చేశారు 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ పరాశయం పాలయ్యారు ఆ తర్వాత జనసేనలో కూడా కొన్నాను యాక్టివ్ గా పని చేశారు..
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ IAS తోట చంద్రశేఖర్ పరిశీలనలో ఉన్నారు. అలాగే కెసిఆర్ సమక్షంలో సోమవారం ఈ పార్టీలో చేరనున్నారు చంద్రశేఖర్.. అలాగే మాజీ మంత్రి రావెల కిశోర్ కూడా బీఆర్‌ఎస్‌లో చేరునున్నట్లు తెలుస్తుంది. వీళ్లిద్దరితో పాటు మరికొందరు మాజీ బ్యూరోక్రాట్లు, నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరతారని చెప్తున్నారు. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును ఎఫెక్ట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడ్ని చేస్తే కాపుల్లో కొందరు బీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.