Political కొందరు ఏ స్థాయికి వెళ్లిన తమ మూలాలను మరిచిపోరు అలాంటి వారిలో ఒకరే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్.. తరచూ తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉండే రిషి ఒత్తిడి సమయంలో తన ఏం చేస్తూ ఉంటారు చెప్పుకొచ్చారు..
బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునాక్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అన్న విషయం తెలిసిందే.. సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునాక్, ఉషా సునాక్ భారతీయ మూలాలు ఉన్నవారు. వీళ్లు తూర్పు ఆఫ్రికాకు చెందిన వారు కాగా.. 1960లో బ్రిటన్కు వలస వెళ్లారు.. అలాగే ఈయన భారతదేశానికి చెందిన ఆమెనే వివాహమాడిన సంగతి కూడా తెలిసిందే ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కుమార్తె అక్షితమూర్తిని 2009లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే దీంతో ఆయన మరింతగా భారతీయ సంస్కృతికి సంప్రదాయాలకు దగ్గరయ్యారు అంతేకాకుండా తరచూ తన అత్త మమ్మల్ని చూడడానికి బెంగళూరు వచ్చి పోతూ ఉండే రిషి తనకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని ఆ సాంప్రదాయాన్ని మర్చిపోను అని చెప్పుకొచ్చారు..
తరచూ తన ప్రసంగంలో కుటుంబ విలువలు, బాధ్యతలు గురించి చెప్పుకు వచ్చిన రిషి.. తనకు బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు భగవద్గీతను చదువుతానని చెప్పారు. అంతేకాకుండా భగవద్గీత తాను మానసికంగా ఎంతో ఉన్నత స్థాయికి రావడానికి కూడా సహాయపడిందని తెలిపారు.. అంతేకాకుండా తన అత్త మామ అయిన ఇన్ఫోసిస్ ఫౌండర్స్ సుధా మూర్తి నారాయణ మూర్తిలను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని వారు వ్యక్తిత్వం మార్గదర్శకమని అన్నారు..