brahmanandam :బ్రహ్మానందం చిన్న కుమారుడి పెళ్లి ఫిక్స్, అయితే ఆయన పెద్ద కుమారుడు గౌతమ్ అందరికీ పరిచయమే. ఆయన సినిమాల్లో హీరోగా నటించడంతో అందరికీ తెలిసు కానీ, ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే, ఆయన ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్‌లోకి రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా బ్రహ్మానందం చిన్న కొడుకు నిశ్చితార్థం అనగానే ఆయన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇయితే ఇటీవల బ్రహ్మానందం ఇంట చిన్న కుమారుడి నిశ్చితార్థం ఎంతో ఘనమ్ గా జరిగింది . బ్రహ్మానందం కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి .
ఇంకా తరువుతా పెళ్ళికి సిద్ధం అవ్వడమే ,అయితే హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ వివాహం చేసుకోబోతున్నారు. ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ మేరకు ఆదివారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. కాబోయే వధూవరుల కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇది ప్రేమ వివాహం కాదు అని పెద్దలు కుదిర్చిన సంబంధమని సమాచారం.
సిద్ధార్థ్, ఐశ్వర్య నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజనులు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బ్రహ్మానందం రెండో కుమారుడు కూడా హీరో మెటీరియల్‌లా ఉన్నాడని అంటున్నారు. జంట చూడముచ్చటగా ఉందని కొనియాడుతున్నారు.