Vaibhavi Upadhyaya : ప్రముఖ బాలీవుడ్ యువ నటి వైభవి ఉపాధ్యాయ ఇక లేరు , సినీ ప్రపంచం ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళింది . ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్(Tollywood) లో ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) కన్నుమూశారు. నిన్న RRR నటుడు రే స్టీవెన్ సన్(Ray Stevenson) కూడా మరణించారు. అలాగే బాలీవుడ్ లో రెండు రోజుల క్రితమే యువ నటుడు ఆదిత్య సింగ్(Aditya Singh) మరణించాడు. తాజాగా బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటి యాక్సిడెంట్ లో మరణించింది.
బాలీవుడ్ యువనటి వైభవి ఉపాధ్యాయ( Vaibhavi Upadhyaya) యాక్సిడెంట్ లో మరణించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాత JD మజేథియా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బాలీవుడ్ లో ప్రముఖ కామెడీ సీరియల్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ తో గుర్తింపు తెచ్చుకుంది నటి వైభవి ఉపాధ్యాయ. ఆ తర్వాత CID, అదాలత్ వంటి టీవీ షోలలో కూడా నటించింది. చెపాక్, తిమిర్.. లాంటి పలు సినిమాల్లో కూడా వైభవి ఉపాధ్యాయ నటించి మెప్పించింది. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది పూర్తి వివరాలు ఇంకా తెలియలి .
వైభవి ఉపాధ్యాయ మృతిపై నిర్మాత JD మజేథియా తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. జీవితం చాలా అనూహ్యంగా ఉంటుంది. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ లో జాస్మిన్ గా ప్రసిద్ధి చెందిన వైభవి ఉపాధ్యాయ మరణించారు. ఆమె నార్త్ లో ఓ యాక్సిడెంట్ లో మరణించారు. ఆమెను నేడు ముంబైకి తీసుకువస్తారు. ముంబైలో నేడు ఉదయం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి అని తెలిపారు. వైభవి ఉపాధ్యాయ మరణంపై పలువురు బాలీవుడ్ టీవీ, సినీ ప్రముఖులు స్పందిస్తూ ఆమెకు నివాళులు తెలియచేస్తున్నారు.