Orange :ముఖంపై నల్ల మచ్చలు అందాన్ని పాడు చేస్తాయి. చూడ్డానికి అంత బాగోవు. వయసు పెరిగే కొద్దీ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో పాటు సన్ టాన్. ఇలా ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. వీటిని సహజంగా దూరం చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో నారింజ పండ్లతో కూడా సమస్యని దూరం చేసుకోవచ్చు. నారింజ నల్లమచ్చలు దూరం చేయడం లో ఎంతగానో ఉపయోగపడుతుంది .
ఆరెంజెస్‌తో బెనిఫిట్స్..
నారింజ పండ్లు ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా చాలా మంచిది. మెరిసే చర్మాన్ని అందించడంలో దీనిలోని విటమిన్ సి చాలా బాగా పనిచేస్తుంది. చర్మంపై మృతకణాలను కాంతివంతంగా మార్చేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సాయపడే ఫేస్ మాస్క్. నారింజ, నారింజ తొక్కలు ముఖంపై బ్లీచింగ్‌లా పనిచేస్తాయి. దీనిని తేనె, చక్కెరతో కలిపి అప్లై చేస్తే స్కిన్‌ని అందంగా చేస్తుంది .
ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు పోగొట్టేందుకు ఆరెంజ్‌ని ఎలా వాడలో ఇప్పుడు చూధాం …ఒక ఆరెంజ్ ని సగానికి కట్ చేసి చక్కెరలో డిప్ చేయండి. దానిపై కొద్దిగా తేనె అద్దండి. ముఖాన్ని క్లీన్ చేసి నారింజని సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత మీరు దీనిని చర్మంపై నల్లగా ఉన్న ఏ ప్రాంతంలో అయినా అప్లై చేయొచ్చు. మెల్లిగా మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత కడగాలి. నల్లని మచ్చలు పోగొట్టేందుకు ఇది బాగా పనిచేస్తుంది.మొహం లో గ్లో కూడా వస్తుంది .ఇన్స్టంట్ గ్లో కోసం కూడా దీనిని ఫేస్ పైన సగానికి కట్ చేసి మసాజ్ చేసుకోవచ్చు .