Bandla Ganesh-Pawan Kalyan : నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి వీరాభిమాని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ పై ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. గురు పూర్ణిమని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాను గురువుగా భావించే పవన్ కళ్యాణ్‌కు ప్రామిస్ చేశారు. .
‘గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను అనీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను. నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి ,సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్’ అంటూ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. బండ్ల గణేష్‌ని పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ దూరం చేస్తున్నాడని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందుకనే పవన్ సినిమా ఈవెంట్స్‌కి బండ్ల గణేష్ ని త్రివిక్రమ్ రానివ్వట్లేదనే వార్తలు వచ్చాయి. వీటిపై గతంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.