Politics తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు నిర్మాత బండ్ల గణేష్ పలు వ్యాఖ్యలు చేశారు.. రంజిత్ రెడ్డి లేకపోతే తాను లేనని ఈ పాటికి ఎప్పుడో చనిపోయే వాడిని అంటూ తెలిపారు..
నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేతన సంగతి తెలిసిందే అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావటమే కాకుండా మరి ఏ పార్టీలోను తాను కొనసాగానంటూ తెలిపారు అలాగే రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు కానీ అప్పుడప్పుడు తనకి ఇష్టమైన వారిని మాత్రం పొగుడుతూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు అలాగే తాజాగా బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు…
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి లేకపోతే తాను లేనని ఈ పాటికి ఎప్పుడో చనిపోయే వాడిని అంటూ తెలిపారు అలాగే తాను ఏ పార్టీలోనే లేకపోయినప్పటికీ రంజిత్ రెడ్డి వెనుక మాత్రం ఉంటాను అంటూ తెలిపారు.. అలాగే రంజిత్ రెడ్డి అన్న లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వాడినని.. నా అన్న, నా దేవుడు, ఆయన కోసమే రాజకీయాలను వదిలేశను అన్నారు.. ఇప్పుడు రంజిత్ అన్న వెనక నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేను అన్నారు.. ఇది రాజకీయ కోణం కాదని రంజిత్ రెడ్డి మీద ఉన్న అభిమానం అని చెప్పుకొచ్చారు..