Political ప్రతి కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి తప్పకుండా వాటా ఉంటుందని భాజాప రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేసిన బండి సంజయ్ కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు..
ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించిన బండి సంజయ్.. సిబిఐ ఈడి దాడులు చూసి వెళ్ళిపోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు.. రాష్ట్ర పరిస్థితులను పట్టించుకోకుండా కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు.. భారత్ 2004 నాటికి ఇస్లామిక్ రాజ్యాంగ మారిపోయేందుకు పిఎఫ్ ఐ కుట్ర పన్నిందని ఆరోపించారు.. దేశాన్ని నాశనం చేస్తున్నా పిఎఫ్ ఐ వంటి ఉగ్రవాద సంస్థల్ని తెరాస ఎంఐఎం పెంచి పోషిస్తున్నాయి.. ఇది ఎంత వరకు సరైన పని అని అన్నారు..
రాష్ట్రంలో ఏ కుంభకోణం బయటపడిన అందులో కేసీఆర్ కుటుంబానికి తప్పకుండా పాత్ర ఉంటుంది అన్నారు. ఉగ్రవాద సంస్థల్ని తెరాస, మజిలీస్ పార్టీలు కావాలనే వెనకేసుకొస్తున్నాయి. ఎన్ఐఏ సోదాలు జరిపే దాకా తెలంగాణ ప్రభుత్వానికి పిఎఫ్ఐ గురించి నిజంగానే తెలియదా అంటూ ప్రశ్నించారు.. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది భాజపా మాత్రమేనని.. ఈ విషయంపై ప్రశ్నించే వాళ్లను అరెస్టులు చేయడం ఎంతవరకు తగిన పని అంటూ విమర్శలు గుప్పించారు.. తెరాస రాజకీయ కుట్రలను ప్రజలు తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుందంటూ సవాలు విసిరారు.