ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. పరోక్షంగా సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్టు పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు.
మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు’’ అని బాలకృష్ణ మండిపడ్డారు. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ ఇటీవల ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన విషయం తెలిసిందే.