ఫోల్డింగ్ ల్యాప్‌టాప్.. ఇప్పటి వరకు మడత ఫోన్లు చూసుంటారు. కానీ మొదటి సారిగా ఆసుస్ అనే కంపెనీ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌కు ఆసుస్ కంపెనీ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడీ అనే పేరు పెట్టింది. ఈ ల్యాప్‌టాప్ ధర అక్షరాల రూ.3,29,000. ఇంత విలువ చేసే ల్యాప్‌టాప్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..
ల్యాప్‌టాప్ ఫీచర్లు..
– 17.3 ఇంచ్ థండర్‌బోల్డ్ 4కే డిస్‌ప్లే
– ఫోల్డ్ చేసేటప్పుడు 12.5 ఇంచ్ స్క్రీన్
– మిగతా స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డుగా ఉపయోగించవచ్చు
– బ్లూ టూత్ కనెక్టివిటీ కోసం నార్మల్ కీ బోర్డు
– ట్యాబ్, డిస్‌ప్లేలా రెండు రకాలుగానూ వాడుకోవచ్చు
– 12వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్
– ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ఈ గ్రాఫిక్ కార్డ్
– 5 ఎంపీ ఏఐ కెమెరా
– డాల్బీ అట్‌మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్లు, 4 యూఎస్‌బీ-సీ పోర్ట్
– అదనంగా 500 జీబీ ఎస్‌ఎస్‌డీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ ఫ్రీ
– 5 స్క్రీన్ మోడ్స్.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్‌టెండెండ్
– మల్టీ స్క్రీన్ ఫీచర్ డిస్‌ప్లేని ఒకేసారి 3 స్క్రీన్‌లుగా ఉపయోగించవచ్చు
ఈ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ ధర రూ.3,29000గా ఆసుస్ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్ ధర రూ.2,84,290కు అందించనుంది. ఈ ఆఫర్ నవంబరు 10 వరకే ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి రూ.27,100 విలువైన ఫ్రీ వారెంటీని అందిస్తోంది ఆసుస్ కంపెనీ.