Political వాలంటీర్లు అంటేనే ప్రజలకు సేవ చేయడానికి ఉండేవాళ్ళు అందుకోసమే వారిని ప్రభుత్వం నియమించింది.. చదువు రాని వాళ్ళకి సైతం సాయం చేస్తూ సక్రమంగా పెన్షన్ డబ్బులు అందించడమే వారి పని అయితే అలాంటిది పోవాలంటే మోసం చేసి అతనికి రావలసిన ఫెంక్షన్ డబ్బులను 23 నెలలుగా కాజేస్తున్నాడు.. ఈ షాకింగ్ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది..
ప్రకాశం జిల్లా పామూరు-3వ సచివాలయం పరిధిలోని కొత్త వాటర్ ట్యాంకు వీధిలో షేక్ మస్తాన్ బాషాకు 2020 సెప్టెంబరులో ప్రభుత్వం దివ్యాంగ పింఛను మంజూరు చేసింది. అతను ఆంధ్రుడు కావడంతో ఇదే అదనుగా ఆ గ్రామ వాలంటీర్ చేతివాటం ప్రదర్శించాడు.. అతడికి కళ్లు కనిపించకపోవడం అలుసుగా తీసుకొని వాలంటీర్ వెంకటకృష్ణ అతి తెలివి చూపించాడు.. అతనికి మంజూరైన పింఛను సొమ్మును 23 నెలలుగా నొక్కేస్తున్నాడు. ఈ క్రమంలో బాధితుడి బంధువైన ఓ మహిళకు అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది..
అందుకైనా మస్తాన్ బాషా పింఛన్ కు దరఖాస్తు చేసుకున్నాడు.. అయితే అతనికి 2020 సెప్టెంబర్ లోనే పెన్షన్ మంజూరు కాగా అప్పటినుంచి మంజూరు కాలేదని చెప్తూ ప్రతినెలా చెకింగ్ కోసమంటూ అతనితో వేలిముద్ర వేయించుకుంటున్నాడు.. ఆ డబ్బుల్ని వాలంటీర్ నొక్కేస్తూ వచ్చాడు. మస్తాన్ బాషా తల్లి షేక్ ఖాజాబీకి వృద్ధాప్య పింఛను వస్తోంది. ఈ కుటుంబానికి పింఛన్ ద్వారా వచ్చే డబ్బులే ఆధారం. ప్రతి నెలా తల్లి వేలిముద్ర వేయించుకొని డబ్బులు ఇస్తున్నాడు.. మస్తాన్ బాషాకు మాత్రం పింఛను కోసం దరఖాస్తు చేస్తున్నానని నమ్మించాడు. ఈ నెల కూడా అలాగే వేలిముద్ర వేయించుకోవడానికి ఎందుకు వెళ్ళగా అందుని బంధువులు ఒక ఆమెకు అనుమానం వచ్చి గ్రామ సచివాలయం కు వెళ్లి అసలు విషయం ఆరా తీయగా 23 నెలల నుంచి పెన్షన్ డబ్బులు వస్తున్నాయని తెలుసుకొని షాక్కు గురైంది.. వాలంటీర్ మోసం బయటపడటంతో వాలంటీర్ల సంఘం అధ్యక్షులు, సభ్యులు లబ్ధిదారుడితో మాట్లాడారు. వాలంటీర్ వెంకటకృష్ణతో మాట్లాడి 23 నెలలకు గాను ఇవ్వాల్సిన మొత్తం సొమ్ము రూ.69 వేలను బాధితుడికి వెంటనే తిరిగి ఇచ్చేశారు. వాలంటీర్ అక్రమాన్ని వెల్ఫేర్ ఆఫీసర్ షరీఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.