AP Poltical News, World Health Organization, Covid News, AP Government, AP Rules on Corona, Village Volunteers, CM Jagan,
COVID NEWS: ఆంధ్ర ప్రదేశ్ ని చూసి నేర్చుకోండి: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
*WHO కితాబు!* ఏపీని చూసి నేర్చుకోండి.. ఫాలో అవ్వండి : వ్యాక్సిన్ విధానంపై WHO కీలక సూచనలు.
*భారతదేశంలో వ్యాక్సిన్ ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సుప్రీంకోర్టు పై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. భారతదేశంలో 70 కోట్ల మందికి ఆన్ లైన వ్యవస్థ అందుబాటులో లేదు.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానం తెలియదు.. అలాంటప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, ఇంటర్ నెట్ సదుపాయం లేని వారు వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.. ఎలా నమోదు చేసుకుంటారు ? ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకే తెలియాలి అంటూ అంతర్జాతీయ మీడియాతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశ్నలు సంధిస్తుంది.
*ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థను మోడల్ గా తీసుకోవాలని.. అందరికీ వ్యాక్సినేషన్ అనేది దీని ద్వారానే సాధ్యం అవుతుందని స్పష్టం చేసింది. ఏపీలో ప్రతి 50 మందికి ఓ వాలంటీర్.. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఉంది. ఈ వ్యవస్థ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థవంతంగా.. 100 శాతం అమలు చేయొచ్చని ప్రపంచ సంస్థలు చెబుతున్నాయి.
*ఏపీలో ప్రతి 45 లక్షల మందిపైగా 60 ఏళ్లు పైబడిన పెన్షన్ దారులు ఉన్నారు. వీరికితోడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. వీళ్లందరినీ లెక్కలోకి తీసుకుంటే 70 లక్షల మంది వరకు ఉంటారు. వీళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వటానికి రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారి అడ్రస్ తెలుసు.. ఎక్కడ ఉంటారో తెలుసు.. వారి కుటుంబ సభ్యుల వివరాలు సైతం వాలంటీర్ దగ్గర ఉంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ ఉండటంతో.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేది ఆంధ్రప్రదేశ్ లోనే అంటున్నాయి అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైజేషన్లు.
*ప్రస్తుతం ఏపీకి రోజువారీ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. సరాసరి రోజుకు 2 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్ 14వ తేదీ అత్యధికంగా 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఏపీలో ఇప్పటి వరకు 65 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా.. 14 లక్షల మందికి రెండు డోసులు సైతం ఇచ్చారు. మరో 54 లక్షల మందికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రానికి వస్తున్న వ్యాక్సిన్ సరఫరాను పరిశీలిస్తే.. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 50 లక్షల మంది అధికారికంగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఎప్పటికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.
*వ్యాక్సిన్ కొరత లేకుండా చూస్తే.. ప్రతి రోజూ కనీసం 25 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 18 నుంచి 45 ఏళ్లలోపు వారు 2 కోట్ల 40 లక్షల మంది ఉన్నారని.. వ్యాక్సిన్ కొరత లేకుండా చూస్తే వీళ్లందరికీ నెల రోజుల్లో వ్యాక్సిన్ వేసేస్తామని.. రెండో నెలల్లో రెండో డోసు కూడా వేసేస్తామని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ఇది సాధ్యం అని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. ఇదే విషయాన్ని అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైజేషన్స్ సైతం అంగీకరిస్తున్నాయి.
*మొత్తానికి గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ అంతర్జాతీయంగా మరో ఘనత సాధించినట్లయ్యింది.
WEAR MASK..STAY SAFE🙏