AP News, CM JAGAN, Covid Vaccine, AP Politics, Bharath Biotech, Serum Institute, Covid News, Health News,
వ్యాక్సిన్ల ఖర్చు ఎంతైనా రెడీ :-సీఎం శ్రీ వైఎస్ జగన్
-ఇప్పటికే కోటా మేరకు రూ.125 కోట్లకు పైగా విలువైన వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డరు..
-37.60 లక్షల డోసుల కొనుగోలు..
రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన మేర వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు గ్లోబల్ టెండర్ల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తోంది..
కేంద్రం ఇచ్చే కేటాయింపుల్లోనూ ఇప్పటికే భారీగా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.125,63,97,450 విలువైన వ్యాక్సిన్ డోసుల కోసం ఆర్డరు పెట్టింది..
ఇప్పటికే రూ.61 కోట్ల వరకు చెల్లింపు..
వ్యాక్సిన్ల కోసం ఇప్పటికే రూ.61 కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మే నెలలో సరఫరా అయిన వ్యాక్సిన్‌కు రూ.49 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు జరిపారు. ఆ మొత్తం చెల్లించిన తరువాతే రాష్ట్రానికి మే నెలలో వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. మరో రూ.64 కోట్లను చెల్లించేందుకు సిద్ధంగా ఉంది.
ఆర్డరు పెట్టిన మేరకు వ్యాక్సిన్ రెడీ కాగానే సంబంధిత సంస్థలు ప్రభుత్వానికి సమాచారం ఇస్తాయి. వెంటనే చెల్లింపులు చేసి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) అధికారులు తెలిపారు.
వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు ఇలా…
సీరం ఇనిస్టిట్యూట్:
ఆర్డరు తేదీ – డోసుల సంఖ్య – విలువ
మే 3, 2021 – 9,91,700 – రూ.31,23,85,500
మే 7, 2021 – 3,50,000 – రూ.11,02,50,000
మే 23, 2021 – 11,45,540 – రూ.36,08,45,100
జూన్ 5, 2021 – 5,88,510 – రూ.18,53,80,650
——————————–
మొత్తం – 30,75,750 – రూ.96,88,61,250
——————————–
భారత్ బయోటెక్ :
ఆర్డరు తేదీ – డోసుల సంఖ్య – విలువ
మే 3, 2021 – 3,43,930 – రూ.14,44,50,600
మే 23, 2021 – 3,40,680 – రూ. 14,30,85,600
—————————
మొత్తం – 6,84,610 – రూ.28,75,36,200
—————————
రెండు కంపెనీలకు పెట్టిన ఆర్డర్ మొత్తం – 37,60,360
విలువ – రూ.125,63,97,450