టీచర్స్ డే రో కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువులను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయనకు మానవత్వం, విలువలు లేవని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో బొత్స మాట్లాడారు.
టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు అని బొత్స వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో విద్యారంగానికి ఏం చేశారో రెండు ముక్కల్లో చెప్పగలరా అని నిలదీశారు. జగన్ సీఎం అయిన తర్వాత ఫౌండేషన్ స్థాయి నుంచి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని .. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకొంటామన్నారు.