AP Government : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు ఓ తీపి కబురు చెబుతుంది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మరింత మెరుగుగా అందించడమే లక్ష్యంగా జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు కొత్త మెనూను తయారు చేసి నేటి నుంచి వాటిని అమలు చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పాత మెనూ వివరాలు :
సోమవారం : అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ ఉండగా..
మంగళవారం : చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు
బుధవారం : కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
గురువారం : కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
శనివారం : అన్నం, సాంబార్, తీపిపొంగలి
కొత్త మెనూ వివరాలు :
సోమవారం : హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ
మంగళవారం : చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
బుధవారం : కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
గురువారం : సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
శనివారం : ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి.