Political News : గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఎప్పుడు మీడియాతో మాట్లాడిన టిడిపి నేతలు గురించి లేదా జనసేన అధినేతను గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈసారి వీరిద్దరిని విమర్శించారు నాని. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊ ఆ ఇద్దరు లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సున్నా అని ఎద్దేవా చేసి మాట్లాడడం జరిగింది.
ఈరోజు గుడివాడలోని పదో వార్డు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నాని మీడియాతో మీడియాతో మాట్లాడటం జరిగింది. ఎన్టీఆర్ చిరంజీవి పేర్లు వాడకుండా ఎన్నికల్లో పాల్గొంటే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఓట్ల శాతం సున్నా అని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక్క శాతం ఓటు బ్యాంకింగ్ లేదని ఎద్దేవ చేసి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేరని కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో తనదే విజయం అని ఈసారి టిడిపి జనసేన శాశ్వతంగా పోతుందని అన్నట్లు మాట్లాడారు. గత ప్రభుత్వం చేయలేని పనులను ప్రస్తుత ప్రభుత్వం చేసింది అని ప్రజలు వాటన్నిటిని గమనిస్తున్నారని. వచ్చే ఏడాది కూడా తమదే విజయం అని చెప్పుకొచ్చారు. అలానే కరణం ధర్మశ్రీ కూడా జనసేన అధినేత పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి నాని చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యానాలపై టిడిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాలి. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాని వాక్యాలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.