Political News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన భాగంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడటంతో జగన్ మోడీని కలిసేందుకు వెళ్లారా లేదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేంద్ర ప్యాకేజీ కొరకు వెళ్లారా అనే విషయం ఇంకా తెలియలేదు. ఏదేమనప్పటికీ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పరిపాలనలో పోలవరం ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీ ఇంతవరకు చిక్కుముడి విడలేదనె చెప్పుకోవాలి. ప్రతిసారి సీఎం ప్రధాని మోడీని కలిసి రావడం తప్ప ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి లాభం చేకూర్చలేదని ప్రత్యక్ష పార్టీ వారు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే.
నేడు జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరు ప్రధానమంత్రితో ముచ్చటించడం జరిగింది. అయితే పలు వార్తల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల మరియు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు అలానే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నిధుల విడుదల తదితర విషయాల గురించి మాట్లాడుతున్నారని వార్తలు రావడం జరిగింది. ఏదేమనప్పటికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రధానమంత్రి కలిశారు లేదా ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఆంధ్రప్రదేశ్ కు కావలసిన నిధుల గురించి మాట్లాడారు అనే విషయాలపై క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడడంతో ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రస్తుత ప్రభుత్వం పై కేంద్రానికి రావలసిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎప్పటికీ వస్తాయి అంటూ ఎద్దేవా చేస్తున్న విషయం తెలిసిందే.