ap polPolitics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన నరేంద్ర మోడీని ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం.. అలాగే మోడీతో భేటీ అనంతరం కేంద్ర మంత్రులను జగన్ కలవడం ఉన్నట్టు తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన నరేంద్ర మోడీని కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో కీలక విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.. ఈ సందర్భంగా వీరిద్దరూ రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ ఆనాటి విభజన చట్టంలో పేర్కొన్న విషయాలు ఏవి ఎప్పటికీ పూర్తి చేయలేదంటూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది.. అలాగే విభజన చట్టంలో ఉన్న విషయాలను త్వరలోనే పరిష్కరించాలని మోడీని కోరినట్టు సమాచారం అంతేకాకుండా పార్లమెంటు వేదికగా ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్ అన్నారని.. అలాగే ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్పల కీలక విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది.. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని ఏర్పాటైన కమిటీల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఈ అన్ని విషయాలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని మోదీని కోరినట్టు తెలుస్తోంది..
ఇది మాత్రమే కాకుండా రాజకీయపరమైన అంశాలపై కూడా వీరిద్దరూ కాసేపు చర్చించుకున్నట్టు తెలుస్తోంది అయితే రెండు రోజులు పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు.. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మోడీతో భేటీ అనంతరం కేంద్ర అటవీశాఖ మంత్రం భూపేంద్ర యాదవ్ తో జగన్ భేటీ అవ్వనున్నారంటూ తెలుస్తోంది అదేవిధంగా రాత్రి 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ అవ్వనున్నారు