politics ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వివాదాలు రోజురోజుకీ తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి తాజాగా మాచర్ల జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన సంఘటన మరువకు ముందే గుంటూరు తెనాలిలో అన్న క్యాంటీన్ భవనానికి నిప్పు అంటించారు ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది
రాజకీయ వివాదాలు రోజురోజుకీ తారాస్థాయిని చేరుకుంటున్నాయి ముఖ్యంగా ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయి నుంచి తీవ్రస్థాయిలో ప్రమాదాలు కొని తెచ్చుకునే స్థాయికి వెళ్లిపోయారు.. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి ముఖ్యంగా టిడిపి భవనాల మీద దేవాలయాల మీద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా మంటల రాజకీయం మాచర్ల జిల్లా నుంచి తెనాలి జిల్లాకు మారిపోయింది.. మాచర్ల జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టిన సంఘటనతో టిడిపి నాయకులు అంతా ఈ విషయంపై ఫైరైన సంగతి తెలిసిందే అయితే తాజాగా గుంటూరు జిల్లాలో అన్నా క్యాంటీన్ భవనానికి నిప్పు పెట్టి పారిపోయారు దుండగులు..
శనివారం అర్ధరాత్రి సమయంలో అన్నా క్యాంటీన్ భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లంతా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.. అయితే ఈ విషయంపై మరోసారి టిడిపి నాయకులు అంతా ఫైర్ అయ్యారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి కేసును ఫైల్ చేయించారు..