Anil Ravipudi : ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. కాగా ఇప్పుడు తాజాగా ”అరే.. స్టాక్స్ దుమ్ములేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిల్లీపోతుంది” అని అంటున్నారు అనిల్ రావిపూడి. ప్రముఖ ఓటిటీ ఆహా వేదికగా ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ అనే షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈ షో నిర్వాహకులు తెలిపారు.
వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ తదితరులు ఈ షోలో కనిపించబోతున్నారు. ఈ షోకి సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరించనున్నాడు. ఈ సంధర్భంగా షో గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ”ప్రతిభావంతులైన నటులతో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి సంతోషిస్తున్నారు. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
అలానే దీని గురించి నిర్వాహకులు వివరిస్తూ, ”’కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ చాలా ప్రత్యేకమైంది. స్టేజీల మీద కామెడీ చేసి, ప్రేక్షకులకు తమవైన మాటలతో చక్కిలిగింతలు పెట్టి కడుపుబ్బ నవ్వించే వారికి పెద్ద పీట వేస్తుంది. ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన తెరకెక్కించిన ఎఫ్ 3 రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే బాలయ్య తో సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్.