Andrea Jeremiah సింగర్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా తన కెరీర్ ను మలుపు తిప్పుకున్న నటి ఆండ్రియా జర్మియా. తమిళ నటి అయినప్పటికీ తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈ భామకి. 2014లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పిశాచి 2 చిత్రంలో ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఆండ్రియా నగ్నంగా కనిపించనుంది అనే వార్త హల్చల్ చేస్తుంది. అయితే దీనిపై డైరెక్టర్ మిస్కిన్ ఒక క్లారిటీ ఇచ్చాడు.
ఆండ్రియా ఈ సినిమాలోని నగ్నంగా నటించిన మాట నిజమే. ఇందుకోసం ఈమె రెమ్యునేషన్ కూడా ఎక్కువగానే అడిగింది. అయితే ఈ విషయం నాకేమీ తప్పు అనిపించలేదు. షూటింగ్ సమయంలో సెట్ లో ఇంకెవరూ లేరు ఆమెతో ఆమెతో పాటు ఒక లేడీ ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉన్నారు. అయితే ఈ ఫోటోలను వీడియోగా చిత్రీకరించాలి అని అనుకున్నాం. అయితే చివరికి వచ్చేటప్పటికి సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని, సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిందే అందుకే ఈ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని నిర్ణయించాము. షూట్ చేసిన మాట నిజమైనప్పటికీ ఈ సన్నివేశాలు అయితే సినిమాలో ఉండవు అని వివరణ ఇచ్చారు దర్శకుడు మిస్కిన్.
అయితే ఆగస్టు 31న ఈ సినిమా విడుదల కానుంది అన్న ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికీ దీనిపై ఇంకేమీ క్లారిటీ రాలేదు. వాయిదా పడే అవకాశమే కనిపిస్తుంది..తమిళ్ హీరో కార్తీతో కలిసి ఆండ్రియా జర్మియా నటించిన చిత్రం యుగానికి ఒక్కడు. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యి ఎంత ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో ఆండ్రియా టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.