Andra Pradesh CM YS Jagan Mohan Reddy, World Bank, Andra Pradesh News, CM Jagan, Latest Telugu News, Telugu World Now
ANDRA PRADESH NEWS: జగన్ సంకల్పానికి ప్రపంచబ్యాంక్ దన్ను
పండితుడైనవాడు ప్రపంచం మొత్తం పూజింపబడతాడు అని పెద్దల వాక్కు. సరైన ఆధునిక విద్యాప్రమాణాలు నేటి విద్యార్థినీవిద్యార్థులను అందించాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రమకోర్చి, మేధావులతో చర్చించి ప్రభుత్వ విద్యాలయాలను కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా వందల కోట్ల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దుతున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఆంగ్లమాధ్యమం అనివార్యమని గుర్తించిన దార్శనికుడు ఆయన. పిల్లలను పాఠశాలల్లో చేర్చి ఉత్తమ పౌరులుగా తయారుచెయ్యాలనే మహత్తర ఆశయంతో తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పధకం ద్వారా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలను జమ చేస్తున్నారు.
ధనవంతుల పిల్లలకు పోటీగా నిరుపేదల పిల్లలు కూడా వస్తారనే భయంతో కొందరు తుచ్చులు జగన్ ఆశయాలకు తూట్లు పొడవడం కోసం వ్యవస్థలను అడ్డు పెట్టుకుని అవరోధాలను కలిగిస్తూ కువిమర్శలు చేస్తున్నారు. న్యాయస్థానాలతో వ్యతిరేక తీర్పులు తెప్పించి తమ రాజకీయ లబ్ధికోసం అమాయక పిల్లల జీవితాలను నాశనం చెయ్యడానికి తెగిస్తున్నారు.
కులగజ్జి, క్షుద్రమీడియా, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఎంతటి నీఛ విమర్శలకు పాల్పడినా జగన్ సంకల్పించిన నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి లాంటి కార్యక్రమాలను ప్రశంసించడమే కాకుండా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును అప్రూవ్ చేసిందని తెలిసింది.
జగన్ సర్కారుకు, అధికారులకు అభినందనలు