Political ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవీ నవరాత్రుల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆదివారం మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ వెళ్లనున్న జగన్ ఆంధ్ర ప్రదేశ్ తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలతో పాటూ పసుపు కుంకుమ సమర్పించనున్నారు..
మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.. ఆదివారం మూలా నక్షత్రం రోజున మరింత మంది భక్తులు విజయవాడ రానున్నట్టు తెలుస్తుంది.. ఇందుకు అధికారులు, ఆలయ సిబ్బంది కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఈ రోజు రాష్ట్రాల నుంచి పలువురు భక్తులు నిత్యం విజయవాడ ను దర్శించుకుంటున్నారు.. సీఎం జగన్ దుర్గాదేవిని దర్శించుకున్నంత కాసేపు సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించనట్లు తెలుస్తుంది.
జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రతి ఏడూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆయన నివాసం తాడేపల్లిగూడెం నుండి విజయవాడ కు చేరుకోనున్న జగన్ అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోనున్నారు.. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకొనునట్లు సమచారం.. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికనున్నారు