Political కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు దేశ విభజన సమయంలో జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 ని ప్రవేశపెట్టి అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పెద్ద తప్పిదం చేశారని అన్నారు..
దేశంలో కేవలం ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ఆర్టికల్ 370 ని ప్రవేశపెట్టిన అప్పటి ప్రధాన జవహర్లాల్ నెహ్రూ చేసిన పనిని తప్పుపట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అయితే నెహ్రూ చేసిన ఆ తప్పిదాన్ని మోడీ సరి చేశారని అన్నారు.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన గౌరవ్ యాత్రలో పాల్గొన్న అమిత్ షా తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై తాజాగా గుజరాత్ పర్యటనకు వచ్చినా ప్రధాన మోడీ కూడా అందించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న అన్ని సమస్యలకు కారణం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే అంటూ ఆరోపించారు..
“ఆర్టికల్ 370 విధించి జవహార్లాల్ నెహ్రూ చేసిన తప్పిదంతో ఆ రాష్ట్రం మొత్తం గందరగోళం నెలకొంది అంతేకాకుండా జమ్ము కాశ్మీర్ రాష్ట్రం ఏరోజు భారత్లో పూర్తిగా కలవలేకపోయింది ఆ ఆర్టికల్ రద్దుచేసి అక్కడ సాధారణ పరిస్థితి తీసుకురావాలని ప్రతి ఒక్కరు భావించారు అది కేవలం నరేంద్ర మోడీ నిర్ణయంతో మాత్రమే సాధ్యమైంది.. అందరూ కోరుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ దేశంలో ఏకమైంది” అన్నా
రు అమిత్ షా..