సంగీతంలో తన కంటూ ప్రత్యేక ముద్ర సృష్టించుకున్న సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. అటు మాస్ సినిమాలకు, ఇటు క్లాస్ సినిమాలకు ఒకేసారి బాణీలు కట్టి శ్రోతల హృదయాలను దోచుకోవడంలో దిట్ట. తాజాగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సినిమా `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఇందులో `మాంగళ్యం తంతునా..` అనే పాట సందర్భాన్ని ఫోన్లో విని వెంటనే ట్యూన్ కట్టేశారు. `ఆడవాళ్ళు మీకు జోహార్లు`లో పాటలు ఇప్పటికే ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని సంగీతం గురించి పలు విషయాలను మీడియాతో ఇలా పంచుకున్నారు.
సంగీతానికి ఎప్పుడూ గోల్డెన్ ఎరానే. అందుకే వందేళ క్రితం పాటలను ఇంకా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాం. వాటిని మర్చిపోలేదు. మైకేల్ జాక్సన్, ఎం.ఎస్. విశ్వనాథన్, ఇళయారాజా ఇలా ఎందరో వున్నారు. వారు సంగీతం చేసినప్పుడు సోషల్ మీడియా లేదు. సంగీతం తీరాలు దాటి వెళుతూనే వుంటుంది. లక్షలు, మిలియన్ల వచ్చాయంటే నాకు అది గ్రేట్ అనిపించదు. ఐ లవ్ మ్యూజిక్. నేను మ్యూజిక్ ప్రేమికుడిని. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈనెల 28న మా గురువుగారు మాండొలిన్ శ్రీనివాస్ గారి జయంతి. అందుకే ఆయన కోసం కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నా.నేను చేస్తున్న కొత్త సినిమాలు ఎఫ్ 3 చేస్తున్నా. బాబీ దర్శకత్వంలో చిరంజీవిగారి సినిమాలో మూడు పాటలు చేసేశాం, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మూవీ చేయబోతున్నా, వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా.. అదేవిధంగా బాలీవుడ్ మూవీ చేస్తున్నా.