Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. సినిమాలతో పాటు తన ఫ్యామిలీకి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు అల్లు అర్జున్. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా తన కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి ఉండేందుకు, వారితో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట ఫుల్ గా వైరల్ అవుతూ ఉంటాయి.
ముఖ్యంగా అల్లు అర్హ ముద్దు ముద్దు మాటలు, చిలిపి శేష్ఠలు, అల్లరితో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక తండ్రి, కూతురు కలిసి చేసే సందడికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. నేడు ఈ ముద్దుల పాప ” అర్హ ” పుట్టిన రోజు. దీంతో సోషల్ మీడియా వేదికగా బన్నీ ఓ వీడియోను షేర్ చేసి అర్హకి శుభాకంక్షాలు తెలిపాడు. ఈ వీడియో లో అల్లు అర్జున్ కు తన కూతురు కందిరీగలు గురించి చెబుతూ ముద్దుముద్దుగా మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇవ్వనుంది అర్హ. అంతేకాదు అల్లు అర్హ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయసులోనే చెస్‌లో శిక్షణ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. చూడాలి మరి ఈ చిన్నారి అడుగులు భవిష్యత్తులో ఏ రంగం వైపు వెళ్తాయో అని…