Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప – 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప” చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆ ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించగా.. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. అయితే సోషల్ మీడియా లోనూ టాక్టివ్ గా ఉండే బన్నీ .. ఫోటోస్, వీడియో లు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటాడు.
కాగా తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు దుబాయ్. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ దుబాయ్ వస్తాను అని పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ గోల్డెన్ వీసా అందుకోవడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్ట్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
యూఏఈ ప్రభుత్వం నుంచి తొలి ‘గోల్డెన్ వీసా’ను అందుకున్న వ్యక్తి షారుఖ్ ఖాన్. ఆ తర్వాత సంజయ్ దత్, సానియా మీర్జా సైతం గోల్డెన్ వీసాలను పొందారు. అలానే బాలీవుడ్ లో పలువురు ఈ వీసాను అందుకోగా.. సౌత్ ఇండస్ట్రి నుంచి కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, విక్రమ్, సోను సూద్, టోమినో థామస్, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి.. ఉపాసన, త్రిషా, పూర్ణ, కాజల్ అగర్వాల్, మీనా, ఉన్నారు. ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ ఈ గఃనత సాధించిన మొదటి నటుడిగా నిలిచారు.