Entertainment ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇప్పటికే అల్లు ఫ్యామిలీ నుంచి నాలుగో తరం వారసురాలుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శకుంతల చిత్రంలో ఓ పాత్రలో నటించింది ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది..
మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఎస్ఎస్ఎంబీ 28’లో అర్హను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే నిజమైతే ఇంకా అల్లు అర్హ సినిమాల్లో కంటిన్యూ అవుతుందా అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి..
అలాగే తన క్యూట్ క్యూట్ మాటలతో అర్హ చేసే అల్లరిని సోషల్ మీడియాలో చూస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు అర్హ.. మహేశ్ సినిమాలో కనిపించనుందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఎస్ఎస్ఎంబీ 28లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. జనవరిలో ‘ఎస్ఎస్ఎంబీ 28’ రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ చిత్రంలోని హలో అరహ ప్రధాని పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం అయితే త్రివిక్రమ్ కేవలం అల్లుఅర్జున్ ఈ రోజు క్రియేట్ చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే అసలు విషయం ఏంటి అని తెలియాలంటే మాత్రం చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన రావాల్సిందే..