Akkineni Family : నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ఆదివారం రోజు విజయోత్సవ వేడుక నిర్వహించారు. అయితే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా బాలకృష్ణ ఇప్పుడు విమర్శపాలవుతున్నారు.
ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు. వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు,, ఆ రంగారావు .. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని అన్నారు. ఇక్కడ బాలయ్య అక్కినేని తొక్కినేని అని అనడంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా తప్పు బడుతున్నారు.
దీంతో బాలయ్యపై సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత కూడా వచ్చింది. ఉద్దేశపూర్వకంగా అన్నారో లేక కావాలని అన్నారో అన్న విషయం పక్కన పెడితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లతో హర్ట్ అయ్యారు. తాజాగా బాలయ్యకు హీరోలు నాగ చైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అక్కినేని వారసులైన యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్ లో .. ఎన్టీఆర్ గారు, రంగారావుగారు, నాగేశ్వరరావు గారు తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ వారు రాసుకొచ్చారు. #ANRLIVESON అంటూ ఆ పోస్ట్ లకి ట్యాగ్ చేశారు.
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023