ఆదిత్య బిర్లా గ్రూప్ వైస్ చైర్మన్ శ్రీమతి రాజశ్రీ గారు ఇబ్రహీంపట్నం పరిధిలో పుష్పశ్రీ ఫ్యాక్టరీని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారితో మాట్లాడారు. రాచకొండ కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులను, నేర నియంత్రణ విధానాలను, షి టీమ్స్ పనితీరును మరియు సీసీటీవీల నిర్వహణ వంటి పలు అంశాల గురించి ఆమె రాచకొండ సిపి గారిని అడిగి తెలుసుకున్నారు.
కమిషనర్ గారి కోరిక మేరకు ఆదిత్య బిర్లా గ్రూప్ తరపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రాచకొండ పరిధిలోని సీసీటీవీల నిర్వహణ కొరకు మరియు ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించి అవసరమైన సాంకేతికపరమైన తోడ్పాటు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అప్ప డైరెక్టర్ అభిలాష బిస్త్ ఐపీఎస్, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు మరియు కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.