Entertainment సాధారణంగా సెలబ్రిటీలు సామాన్యులులాగా రోడ్లపై షికార్లు కొట్టడం కష్టమే. ఎందుకంటే వారి కనిపిస్తే ఫ్యాన్స్ వారిని చుట్టుముట్టేసి సెల్ఫీలు అంటు ఎగబడుతుంటారు. ఇంకొంతమందైతే ఏకంగా అత్యుత్సాహం ప్రదర్శించి వారిని ఇబ్బంది పెడతారు. అందుకే సెలబ్రిటీలు తమను గుర్తుపట్టని చోటుకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. లేదా అప్పుడప్పుడు ముఖానికి ముసుగు వేసుకుని రోడ్లపైకి వస్తుంటారు. సామాన్య ప్రజలుగా వారితో కలిసి పోయి సరదాగా తిరుగుతారు. అయితే తాజాగా ఓ సీనియర్ నటి కూడా ఇలానే చేసింది. భాగ్యనగర వీధుల్లో.. ఆటోలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఒకప్పుడు వెండితెర మీద స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రజ. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2007లో ఆమెకు వివాహం కాగా.. సుమారు 7 సంవత్సరాలు పాటు తెర మీద కనిపించలేదు. ఆ సమయంలో తన పాప బాగోగులు చూసుకుంటూ గడిపినట్లు తెలిపారు. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. మరోవైపు బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నారు. పలు షోలలో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. తన స్మైల్, మాట, డ్రెస్సింగ్ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఇంద్రజ భాగ్యనగర వీధుల్లో ఆటోలో షికార్లు కొట్టారు.
డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.. ఇలా ఆటోలో ప్రయాణించడం చాలా బాగుందని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రసుత్తం అది వైరలవుతోంది.
https://youtu.be/v45G5Svpct0