Actress Andrea : సింగర్‌గా, నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ” ఆండ్రియా “. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆండ్రియా బాగానే పరిచయం. అప్పట్లో కార్తి హీరోగా వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో ఇక్కడ పలకరించింది ఈ భామ. ఆ తర్వాత సునీల్, నాగ చైతన్య హీరోలుగా వచ్చిన ‘తడాఖా’లో కూడా మెరిసింది. విశ్వరూపం చిత్రంతో ఆండ్రియాకు మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది మూవీ లవర్స్‌కి ఆమె ఎక్కువగా సుపరిచితం అయ్యింది. అయితే ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.
అయితే ఇటీవల కాలంలో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించడమే కాకుండా బోల్డ్ వ్యాఖ్యలతోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తాను ఒక వ్యక్తిని నమ్మి సహజీవనం చేసి మోసపోయానని తెలిపి అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రియా మరోసారి సెన్సేషన్ కామెంట్స్ చేసింది. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పిన ఆండ్రియా.. అతనితో పెళ్లి కూడా చేసుకోవాలుకున్నానని కానీ వర్కవుట్ కాలేదని చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి తనను చాలా దారుణంగా మోసం చేశాడని తెలిపింది.
తనకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, జీవితంలో ఆనందంగా గడపాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది యువతులు సంతోషంగా లేరని… పెళ్లి చేసుకోకుండానే చాలా మంది సంతోషంగా జీవిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే భవిష్యత్తులో పెళ్లి విషయంలో ఆండ్రియా తన ఆలోచన మార్చుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఆండ్రియా హీరోయిన్ గా తెరకెక్కిన అనల్ మేలే పని తులి అనే చిత్రం ఓటీటీ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో పాటు పిశాచి 2 చిత్రంలోనూ ఆండ్రియా నటిస్తుంది.