Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో శర్వానంద్ కూడా ఒకరు. తనదైన నటనతో, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ శర్వానంద్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి శర్వానంద్ పెళ్లి విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.
ఇప్పుడు తాజాగా ఈరోజు శర్వానంద్ నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగింది. రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని శర్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. రక్షిత ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుందని సమాచారం. మాజీ మంత్రి, టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు.
ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, అల్లరి నరేష్, సాయి రామ్ శంకర్, దిల్ రాజు ఫ్యామిలీ లతో పాల్గొన్నారు. అలాగే తరుణ్, వడ్డే నవీన్, శ్రీకాంత్, రానా, గౌతమ్, సిద్దార్థ్, అదిరిరావు హైదరి.. మరి కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇటీవలే బాలకృష్ణ షోలో ప్రభాస్ చేసుకున్నాకే నేను పెళ్లి చేసుకుంటానని శర్వానంద్ చెప్పడంతో సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలని వైరల్ చేస్తూ ప్రభాస్ అన్నని మోసం చేశావుగా అంటూ సరదాగా మీమ్స్ వేస్తున్నారు. కొత్త జంటకి టాలీవుడ్ ప్రముఖులతో పాటు, అభిమానులు. నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.