Entertainment మా టాలీవుడ్ నటుడు నరేష్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి అయితే తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేసాడు నరేష్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఒక వీడియోను కూడా విడుదల చేశారు దీంతో మరోసారి నరేష్ ముందు పెళ్లిళ్ల విషయం చర్చనీయాంశంగా మారింది..
నటుడు నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే అయితే కొన్ని కారణాలతో వీరందరితో విడిపోయాడు ప్రస్తుతం నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారు అయితే గతంలో తన మూడు పెళ్లిళ్ల కోసం ఎందుకు వీడికి పోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు నరేష్ అలాగే ఏ విషయానికి ఎవరిది తప్పు అనలేమని అభిప్రాయ బేధాలతో విడిపోయామని కూడా తెలిపాడు..
అలాగే ఓ సారి స్వయంగా మాట్లాడిన నరేష్.. 17 ఏళ్లకే హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టాను. 19 ఏళ్లకు పెద్దలు నాకు పెళ్లి చేశారు. అంటే దాదాపు బాల్య వివాహం. ఆ వయసులో నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఆమెకు అనారోగ్యం అందుకే విడిపోవాల్సి వచ్చింది. తర్వాత రెండో వివాహం చేసుకున్నాను. మనస్పర్థలతో విడిపోయాము. మూడో భార్యతో కూడా విభేదాలతో విడిపోవాల్సి వచ్చింది. ఇలా విడిపోవడంలో తప్ప ఎవరిది అంటే ఎవర్ని నిందించలేము ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఇలాంటివి వినిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి దగ్గర విభేదాలతో విడిపోయేవారు కనిపిస్తూనే వస్తున్నారు.. అంటూ చెప్పుకొచ్చాడు నరేష్..