Crime News : బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన భార్య సోదరి అయిన ఒక మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేసిన సంఘటన Cr.NO: 193/2019 కేసులో నిందితుడు మహమ్మద్ అల్తా జిల్ధానీ s/o MD. యూనస్, వయస్సు: 40 సంవత్సరాలు, occ: హుమానీ ఇండస్ట్రీయల్ కంపెనీలో సూపర్‌వైజర్, కుంట్లూర్ రోడ్ హయత్ నగర్, R/o మహమ్మదీయ మస్జిద్ ఫాతిమా నగర్, వట్టేపల్లి, హైదరాబాద్. N/o నిజామాబాద్ కి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది.
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 376(2)(i),506 IPC & SEC 5(i)R/w 6 ఆఫ్ పోక్సో చట్టం, బాలాపూర్ స్టేషన్ SC NO:191/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం, ఎల్ బి నగర్‌లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గారు నిందితుడిని ఈ రోజు అనగా 09/10/2024న దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష మరియు రూ.20,000/- జరిమానా విధించబడింది మరియు బాధితురాలికి నష్టపరిహారం రూ. 5,00,000/- అందించబడింది.