Crime చలికాలంలో వచ్చే పొగ మంచి వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా హైవే పైన వెళ్ళినప్పుడు వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటికే దీనివలన పెను ప్రమాదాలు సంభవించగా తాజాగా యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుని పలువురు గాయాల పాలయ్యారు..
ఉత్తరప్రదేశ్లో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ రేపై పొగ మంచు కారణంగా రెండు వాహనాలు ఢీకొన్నాయి.. ఇప్పటికే ఇలా పొగ మంచు కారణంగా పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఎందరో ఈ విషయంలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు అయితే తాజాగా ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు..
వివరాల్లోకి వెళితే యూపీలో దట్టంగా పొగ మంచు అనుకుంటుంది దీనివలన ఇప్పటికే ఎన్నోసార్లు ప్రమాదాలు జరుగుతూనే వచ్చాయి తాజాగా ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో ఎదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటికీ ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అదే సమయంలో 8 మందికి పైగా గాయపడ్డారు. అయితే క్షతగాత్రులను వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి విచారణ జరిపిస్తున్నారు అయితే ప్రమాదం కారణంగా రోడ్డుపై పలు వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ ఇబ్బంది అయింది.. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అంత ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు..