చాలా మందికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కనిపించదు…యావత్ భారత దేశంలోనే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా అని తెలిసినట్లు లేదు… వరి దిగుబడి లో మొట్టమొదటి స్థానాన్ని అక్రమించించిన పంజాబ్ రాష్ట్రం ఒక్క కారుకు పండించే పంట తెలంగాణా రాష్ట్రంలోనీ ఒక్క నల్లగొండ జిల్లాలో ఒక్క కారుకే అంతటి దిగుబడి వస్తుందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాగసోపేత నిర్ణయం అని గుర్తించేందుకు కొందరికి మనస్కరించడం లేదు… దున్న పోతూ ఈనింది అంటే దూడ ను కట్టెయ్యమన్న చందంగా వాట్సాప్ యూనివర్సిటీ ని పార మీటర్ గా భావించి అదే పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం అదే పనిగా కొందరు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.
తెలంగాణా వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది అంటే అందుకు నిరంతర విద్యుత్ సరఫరాయే కారణమన్నాది గాలి మిషన్ నడిపేటోడి నుండి గాలి మోటార్ నడిపేటోడి వరకు గురించందడ్రు గాని గదేందో చదువుకున్నామని బీరాలు పలికేటోడి కి మాత్రం ఇప్పటికీ గుర్తుకు రావడం లేదు… నువ్వు ఇంతున్న ఇంట్లో 2014 కు ముందు కరెంట్ ఉండేది ఎంత సేపు…నువ్వు పదో తరగతి చదువుతున్నప్పుడు ఉన్న కరెంట్ ఎంత సేపు… 2014 తరువాత సరఫరా అవుతున్న కరెంట్ ఎంతసేపు అన్నది నీకు గుర్తుకు రాక పోతే పక్క బజార్ లో ఉన్న ఇస్త్రీ షాపు అతనినో… ఆ పై బజార్ లో ఉన్న హెర్ కటింగ్ షాప్ లోనో లేదు అనుకుంటే బార్ షాప్ లో పనిచేసే వెయిటర్ నో అడుగు చెబుతాడు… గతాన్ని గుర్తు చేసుకో నడుస్తున్న చరిత్ర వర్తమానానికే కాదు యావత్ భారత దేశానికి ముమ్మాటికీ రోల్ మోడల్….
తెలంగాణా ఒకటి ఉందని అందులో నల్లగొండ జిల్లా ఒకటి ఉంటుందని ఆ జిల్లాలో మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ ఒకటి ఉందని ఆ డివిజన్ లో దామరచర్ల కలదని దానిని అనుకుని 25 వేల అల్ట్రా మేఘా పవర్ ప్లాంట్ పెట్టొచ్చని ఆ ప్లాంట్ తో నీ పిల్లలకే కాదు నీ తదనంతరం మూడు తరాల వరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయొచ్చని అందుకు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి నిర్ణిత వేళలో నిర్మించి రేపో మాపో జాతికి అంకితం చేయబోతున్న మగాడు రా ముఖ్యమంత్రి కేసీఆర్… అటువంటి మహానేత ను పట్టుకొని వాట్సాప్ యూనివర్సిటీ లో వచ్చే పోరంబోకు ముచ్చట్లు వైరల్ చేస్తున్న వారికి ఒక్క సారి పొద్దునే కడుక్కుంటున్న ముడ్డికి నీళ్లు అందించేది కుడా ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న నిరంతర విద్యుత్ … వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ లను వైరల్ చెయ్యడమో పనిపాట లేని పనికిమాలిన వారూ చెప్పే ముచ్చట్లు వినడమో కాదు…
ఒక్కసారిగా గతం లోకి తొంగి చూడు…. బషీర్ బాగ్ చౌరస్తాలో కాల్పులు ఎందుకు జరిగాయి… సమైక్యాంధ్ర పాలకుల పాలనలో కరెంట్ అడిగిన పాపానికి బషీర్ బాగ్ చౌరస్తాలో నలుగురూ తెలంగాణా బిడ్డల్ని కాల్చి చంపింది నిజం కాదా… ఆ నలుగురు తెలంగాణా బిడ్డలే అన్నది మరచి పోయావా.. దానితో చలించి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవులను తృణప్రాయంగా త్వజించి తెలంగాణా ఉద్యమం నిర్మించింది నిజం కాదా… దాంతో తెలంగాణా వచ్చింది నిజం కాదా… ఆ వచ్చిన తెలంగాణాను యూ టర్న్ చేసేలా చెప్పి ఒప్పించి పదవి నందుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ఆషా కిరణం @ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బెత్తం పట్టుకుని తెలంగాణా వస్తే ఇక్కడ కరెంటే ఉండదని ….ఇక్కడి ప్రజలు చీకట్లలో మగ్గుతారంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసింది నిజం కాదా…
వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ తెలంగాణా ను సాధించడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు సైతం పవర్ హాలిడే ప్రకటించిన సీమాంధ్ర పాలకుల మూతుల మీద కొత్త టవల్ లో పాత చెప్పు పెట్టి మూతి మీద కొట్టిన మోగాడు… మొనగాడు…. ముఖ్యమంత్రి కేసీఆర్… అటువంటి వ్యక్తి గురించి ఎవరూ మాట్లాడాలి అన్న సమాదానం గంతే ఉంటుంది… 2014 తరువాత జరుగుతున్న వాస్తావాల నుండి
ప్రత్యేక కధనం by రమేష్ బాబు కాంచనపల్లి